WGL: గీసుగొండ మండలం స్టాంబపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక ఇంటిపై దాడి నిర్వహించినట్లు తెలిపారు. ఇవాళ విశ్వసనీయ సమాచారం మేరకు లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్న IMF మద్యాన్ని పెద్ద సంఖ్యలో సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. జప్తు చేసిన మద్యం విలువ రూ.97,390గా ఉందని తెలిపారు. ఈ కేసులో నిందితురాలు మమతను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.