MBNR: జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన డీఎస్పీ వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాస్పిటల్లో పరామర్శించారు. డీఎస్పీ ఆరోగ్య పరిస్థితిని ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన గన్మెన్, డ్రైవర్ను కూడా ఎమ్మెల్యే కలిసి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.