అన్నమయ్య: గాంధీజీ మార్గం యువతకు మార్గదర్శకమని ఏపీ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుగ్గనపల్లి సురేంద్రారెడ్డి అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస మానవుల జీవనానికి బలమని, సమాజంలో అట్టడుగు వర్గాల ఉద్ధరణ కోసం ఆయన ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు.