సత్యసాయి: వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున దసరా కానుక అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 6,038 మంది దరఖాస్తు చేసుకోగా 5,897 మందిని ఎంపిక చేశారు. 133 దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. రేపు అర్హుల ఖాతాలో రూ.15వేల చొప్పున ప్రభుత్వం జమచేయనుంది.