SKLM: భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన మందస(M)లో చోటుచేసుకుంది. గురువారం హంసరాలి పంచాయతీ టుబ్బూరు గ్రామానికి చెందిన బుద్దయ్య (65), రూపమ్మ (60) దంపతులు మట్టితో కట్టిన ఇంట్లో నివసిస్తున్నారు. భారీ వర్షానికి నిద్రిస్తున్న దంపతులపై మట్టి గోడ కూలిపోయింది. వీరిని గ్రామస్తులు వైద్యం నిమిత్తం హరిపురం CHCకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.