W.G: తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన కొట్టు నాగేంద్ర వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు నాగేంద్ర గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. యువతను ఏకం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నాగేంద్ర తెలిపారు.