TG: దసరా పండుగ సందర్భంగా నగర వాసులంతా పల్లెబాట పట్టడంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ నెలకొంది. దీంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.