ప్రభాస్ నటిస్తున్న భారీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడనే అప్టేట్స్తో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతోందట.
లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఆదివారం నుంచి సలార్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అయ్యాడట ప్రభాస్. ఈ షెడ్యూల్లో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఇంట్రో సీన్స్ షూట్ చేస్తున్నారట. అలాగే ప్రభాస్-పృథ్వీరాజ్ సుకుమారన్‌లపై కీలక యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఊహకందని విధంగా ఉంటుందట.
ఇప్పటికే కెజీయఫ్ సినిమాలకు పనిచేసిన స్టంట్ మాస్టర్స్‌తో భారీ ఫైట్స్ తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు క్లైమాక్స్ కోసం పాపులర్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ని రంగంలోకి దింపుతున్నాడట. దాంతో సలార్ యాక్షన్ సీక్వెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. ఇటీవలే పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్.. సోషల్ మీడియాలో సలార్ గురించి చేసిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.
ప్రశాంత్ నీల్ తనకు తానే పోటీ.. అని.. సలార్ అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని ఆమె రాసుకొచ్చింది. దాంతో సలార్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే.. రిలీజ్ డేట్ 2023 సెప్టెంబర్ 28 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.