ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలోని స్థానిక 9వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లో వోల్టేజ్ సమస్య ఉండకుండా చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాట చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.