కృష్ణా: మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో దాతల ఆర్థిక సహకారం రూ.25 లక్షల అంచనాతో జిల్లా పరిషత్ హైస్కూలుకు అదనపు తరగతి భవన సముదాయం నిర్మాణ పనులు చేపట్టారు. ముఖ్య అతిధిగా నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షల జడ్పీ నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.