SRPT: వానాకాలం వరి పంట చేతికి వస్తున్నా, గడిచిన యాసంగి వరి పంట బోనస్ ఇంతవరకు చెల్లించలేదని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ తెలిపారు. ఇవాళ నడిగూడెం మండలం వల్లాపురంలో రైతులను కలిసి ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్ పూర్తి అయి ఏడు నెలలు దాటినా బోనస్ డబ్బులు రాలేదన్నారు. బోనస్ డబ్బులు చెల్లించి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.