KRNL: మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇవాళ జిల్లా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ డి. వాసు వెంకటేశ్వరమ్మ అధ్యక్షత వహించగా, ఇంఛార్జ్ ఎంపీడీవో జేమ్స్, మండల సిబ్బంది, ఉల్చాల సర్పంచ్ విద్యాసాగర్ పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు.