NLR: విజయదశమి పండుగ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే పర్వదినంగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఈ విజయదశమి సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకు శాంతి, సంపద, సంతోషాలు చేకూరాలని కోరుకున్నారు. ఈ పండుగ విజయాలకు ప్రతీకగా నిలిచి, అందరిలో ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు.