BDK: టేకులపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుక నిర్వహించారు. మహాత్మా చిత్రపటానికి గ్రంథ పాలకుడు నాగన్న పూలమాలవేసి నివాళి అర్పించారు. హింసతో కాకుండా అహింస సిద్ధాంతం నమ్మి బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి స్వతంత్రం సాధించిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీదని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో గ్రంధాలయాల పాత్ర ఉందన్నారు.