TG: మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి టైగర్ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి తుదిశ్వాస విడిచారు. దామోదర్‌రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు.