ATP: దసరా నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా బుధవారం గుంతకల్లు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు వారిని స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.