చాలా మంది జీవితంలో ప్రేమ చాలా కామన్. ప్రాణానికి ప్రాణంగా ఓ వ్యక్తిని ప్రేమించేవారు చాలా మందే ఉన్నారు. అయితే….. మనిషిని కోల్పోయిన తర్వాత… కూడా ఆ ప్రేమను పంచడం అనేది మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. ఓ వ్యక్తి ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అయితే…. ఆ ప్రేమించిన అమ్మాయి అతనికి దూరమైంది. ప్రాణాలు కోల్పోయింది. అయితే… ఆమె ప్రాణాలు పోయినా… అతని ప్రేమ చావలేదు. ఆమె చనిపోయినా… పెళ్లి చేసుకొని.. తన భార్య అనిపించుకున్నాడు. ఇక భవిష్యత్తులో తాను ఎలాంటి పెళ్లి చేసుకోను అని కూడా ప్రకటించడం గమనార్హం. ఈ సంఘటన అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా బోరా మృతి చెందింది. విషయం తెలిసిన బిటుపన్ తట్టుకోలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లాడు. అచేతనంగా ఉన్న ఆమెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. చివరికి అక్కడే అందరి ముందు మృతదేహానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో మరెవరినీ పెళ్లి చేసుకోబోనని ప్రమాణం చేశాడు. ఇది చూసిన స్థానికులు బిటుపన్‌ది స్వచ్ఛమైన, నిజమైన ప్రేమ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.