KRNL: కోడుమూరు శ్రీ వాల్లెలాంబదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. బుధవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా అలంకరించబడింది. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అమ్మవారిని దర్శించుకుని పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఇందులో జడ్పీటీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు రఘునాథ్ రెడ్డి, రమేష్ నాయుడు పాల్గొన్నారు.