»Who Is Brij Bhushan Sharan Singh What His Background
Brij Bhushan మాములోడు కాదు.. దావూద్‌తో సంబంధాలు, ఎస్పీకే గన్ పెట్టి బెదిరించి
WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. బ్రిజ్ మాములు వ్యక్తి కాదు. అతనో శక్తి.. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికై.. నేరస్థులతో పరిచయం ఉన్న బడా నేత.
Who is Brij Bhushan Sharan Singh, What His Background
Brij Bhushan Sharan Singh:ఇటీవల భారత రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. అందుకు కారణం డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) లైంగికంగా వేధించడమే. దీంతో మరోసారి బ్రిజ్ భూషణ్ గురించి చర్చకు వచ్చింది. ఇంతకీ బ్రిజ్ భూషణ్ ఎవరూ…? రెజ్లర్లను వేధించి నెలలు గడుస్తోన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? అతని పదవీ నుంచి ఎందుకు తప్పించడం లేదు. ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) నేపథ్యం పెద్దదే.. అందుకే ఆయన జోలికి ఎవరూ వెళ్లడం లేదని తెలుస్తోంది. 1957లో బిష్ణోపూర్లో కాంగ్రెస్ నేత జగదాంబ శరణ్ సింగ్ కుటుంబంలో జన్మించాడు. సాకేత్ డిగ్రీ కాలేజీలో (degree college) చదువుతుండగా విద్యార్థి సంఘ కార్యదర్శికి ఎన్నికయ్యాడు. అలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడం ప్రారంభించాడు. స్థానిక కాంగ్రెస్ నేత రాజా ఆనంద్ సింగ్‌కు (Raja anand singh) వ్యతిరేకంగా పనిచేశాడు. చెరకు సహకార సంఘం ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. అప్పుడు ఎస్పీ బ్రిజ్‌ను పిలిచి నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కోరాడు. ఆ క్రమంలో వాగ్వివాదం జరిగి తుపాకీ తీసి ఎస్పీకి (sp) గురిపెట్టి.. దూషించాడట. అక్కడినుంచి బైక్‌పై తిరిగి వచ్చేశానని బ్రిజ్ గొప్పగా చెప్పుకుంటాడు.
ముంబైలో (mumbai) అరుణ్ గావ్లీ గ్యాంగ్‌కు చెందిన శైలేష్ హల్డాంకర్ జేజే హాస్పిటల్ వార్డ్ నంబర్ 18లో ఉండగా.. దుండగులు 500 తూటాలు కాల్చి చంపారు. దావూద్ సోదరుడి హత్యకు ప్రతీకారంగా దాడి జరిగి ఉంటుంది. హంతకులకు బ్రిజ్ భూషణ్ ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఇతడి ప్రమేయం ఉందని సీబీఐ పేర్కొంది. మొత్తం 49 మంది నిందితుల్లో బ్రిజ్ కూడా ఒకరు. రెండు కేసుల నుంచి బయటపడ్డాడు అదీ వేరే విషయం. 1996లో టాటా చట్టం కింద జైలులో ఉన్న సమయంలో బీజేపీ నేత వాజ్ పేయి ఇతనికి లేఖ రాశారు. ధైర్యం కోల్పోవద్దని ఆ లేఖలో పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి. ఆ సంవత్సరమే బ్రిజ్ భార్య కేతకి దేవికి బీజేపీ టికెట్ ఇవ్వడ 70 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
గోండా నుంచి 1999లో బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) ఎంపీగా గెలుపొందాడు. ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్ముఖ్తో విభేదాలు ఉన్నాయి. నియోజకవర్గం పేరు జయప్రకాశ్ నగర్‌గా మార్చేందుకు నానాజీ సపోర్ట్ చేశారు. దీనికి వ్యతిరేకంగా బ్రిజ్ భూషణ్ ఆందోళన చేపట్టారు. 2004 ఎన్నికలకు ముందు బ్రిజ్ భూషణ్‌ను బల్రాంపూర్ నియోజకవర్గానికి మార్చింది. గోండా అభ్యర్థిత్వాన్ని వాజ్ పేయి బంధువు ఘనశ్యామ్ శుక్లాకు ఇచ్చారు. అప్పటికే శుక్లా ఎమ్మెల్యే.. కానీ గోండాలో పోలింగ్ జరుగుతుండగానే రోడ్డు ప్రమాదంలో శుక్లా మృతిచెందాడు. బ్రిజ్ భూషణ్ హత్య చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వాజ్ పేయీ ఫోన్ చేసి ‘నువ్వు అతడిని చంపేశావ్’ అన్నారని బ్రిజ్ భూషణ్ ఓ సందర్భంలో వెల్లడించారనే కథనాలు వచ్చాయి. 2009లో బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. కైసర్ గంజ్ నుంచి ఎంపీగా గెలుపొందాడు. తర్వాత తిరిగి బీజేపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించాడు.
రెజ్లింగ్ సమాఖ్యపై కూడా బ్రిజ్ (Brij) దృష్టిసారించాడు. పోటీలను నిర్వహిస్తూ.. యూపీ రెజ్లింగ్ అసోసియేషన్‌లో చేరాడు. జాతీయ రెజ్లింగ్ సమాఖ్యలోకి వచ్చాడు. 2011లో డబ్లూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అలా మూడుసార్లు ఆ పదవీ చేపట్టాడు. రెజ్లింగ్ సమాఖ్యలోకి ఫ్యామిలీని తీసుకొచ్చాడు. కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. మరో కుమారుడు గోండా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అల్లుడు బీహర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌గా ఉన్నాడు. బ్రిజ్ భార్య కేతకి జల్లా పంచాయత్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు, ఓటమిని శాసించే స్థితిలో బ్రిజ్ ఉన్నాడు. అతనిపై చర్యల విషయంలో పార్టీలు సహసించడం లేదు.
తమపై లైంగిక దాడిగి దిగాడని రెజ్లర్లు నిరసన బాట పట్టినా.. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందడుగు వేయలేదు. గత 6,7 నెలల నుంచి ఢిల్లీ పోలీసులు (delhi police) అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే పలుకుబడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెజ్లర్లు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (supreme court) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరీ రెజ్లర్లకు న్యాయం జరుగుతుందా..? లేదో చూడాలీ. వారు మాత్రం ఓ బలమైన నేతను ఢీ కొంటున్నారు.