ఒకప్పుడు ఏమోగానీ ప్రస్తుతం అన్నిభాషల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం సినిమాలు బాలీవుడ్లో దుమ్ముదులుపుతున్నాయి. దాంతో బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాగా మారిపోయింది. కానీ ఇప్పుడు సౌత్‌లోనే వార్ మొదలైపోయింది. కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ చిత్రం.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టేసింది.
ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. అయితే.. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ అనుకున్నప్పటికీ.. ఇప్పుడు డబ్బింగ్ మూవీగా రాబోతోంది. కాబట్టి ఇక్కడ వారసుడుకు థియేటర్ల కొరత తప్పదు. కానీ దిల్ రాజు.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలం కంటే..
వారసుడుకు ఎక్కువగా థియేటర్లు కేటాయిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. గతంలో తెలుగు సినిమాల తర్వాతే.. డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వాలని చెప్పారు దిల్ రాజు. దాంతో ఇప్పుడు కూడా అలాగే కేటాయించాలని తెలుగు నిర్మాతల మండలి కోరింది. దీనిపై తమిళ దర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలను తమిళ్లో అదరిస్తుంటే మా సినిమాలను అపడం ఏంటని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
అక్కడ కూడా తెలుగు సినిమాలను అడ్డుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 22న తమిళ్ నిర్మాతల భేటీ కానుంది. ఈ భేటిలో వారసుడు వివాదం పై చర్చ జరగనుంది. అయితే ఈ వివాదం పై ఇప్పటివరకూ దిల్ రాజు స్పందిచలేదు. కానీ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై నిర్మాత అల్లు అరవింద్ అభ్యంతరం చెప్పడం.. హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు వారసుడు వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. మరి వారసుడు పై దిల్ రాజు ఎలా స్పందిస్తాడో చూడాలి.