»Former Minister Adinarayana Reddy Fire On Ys Jagan And Ys Avinash Reddy In Delhi
CMగా సంతృప్తి లేడు.. YS Jagan ప్రధాని కావాలనుకుంటున్నాడు: ఆది నారాయణరెడ్డి
వైఎస్ వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర ఉంది. ఈ విషయ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి తెలుసు. అయినా కూడా తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసంతృప్తితో రగిలిపోతున్నాడు. అసంతృప్తి అనేది ఉంటే మనిషి ఎన్ని దారుణాలకైనా పాల్పడుతాడు.
నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్ (YS Jagan) సంతృప్తి లేదని.. అతడికి ప్రధానమంత్రి (Prime Minister) కావాలనే ఆశ పుట్టిందని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి (Adinarayana Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. మనిషికి అసంతృప్తి ఉంటే ఎన్ని దారుణాలకైనా పాల్పడుతాడని.. దానికి ఉదాహరణ జగన్ అని పేర్కొన్నారు. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలు, వైఎస్ వివేకా (YS Viveka Murder Case) హత్యకేసులో పురోగతి వంటి అంశాలపై ఆది నారాయణరెడ్డి స్పందించారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వైఎస్ వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర ఉంది. ఈ విషయ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి (CBI) తెలుసు. అయినా కూడా తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ అసంతృప్తితో రగిలిపోతున్నాడు. అసంతృప్తి (DisSatisfaction) అనేది ఉంటే మనిషి ఎన్ని దారుణాలకైనా పాల్పడుతాడు. ఇదే మాదిరి జగన్ సీఎం పదవి వచ్చిందనే సంతృప్తితో లేడు. ప్రధానమంత్రి పదవి కూడా కావాలని ఆయనకు ఆశ పుట్టింది. ఇప్పటికే సీఎం జగన్ 4, 5 లక్షల కోట్లు సంపాదించాడు.’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక వివేకా హత్య కేసు విషయమై స్పందిస్తూ.. ‘వివేకా హత్య పథకం (Plan) ప్రకారమే జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారంతా బయటకు వస్తారు. హత్య చేసి దానికి సంబంధించిన ఆధారాలు చెరిపేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఎంపీ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సీబీఐ విచారణను ఎందుకు తప్పు పడుతున్నారు?. తమకు అనుకూలంగా తీర్పు వచ్చేంత వరకు ఎంత దూరమైనా వెళ్తారు’ అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. ‘ఈ కేసులో బీజేపీ స్పష్టంగా ఉంది. నిందితులు ఎవరైనా పట్టుకోవాలని పేర్కొంటోంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పక ఉంటది. ఇది మహాకుట్ర. ఈ కేసులో నన్ను చంపాలనుకుంటే చంపుకోండి. నన్ను చంపగలరు కానీ ధర్మాన్ని చంపలేరు. నా తప్పు ఉంటే ఎక్కడైౌనా ఉరి తీయవచ్చు. ఎక్కడైనా ఎన్ కౌంటర్ చేయవచ్చు’ అని స్పష్టం చేశారు.