ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో అభిమానుల సంబురాలు అంబరాన్నంటాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర కోలాహలం నెలకొంది. ఫ్యాన్స్ బాణాసంచా కాలుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. టీమిండియాకు విషెస్ చెబుతూ కేరింతలు కొట్టారు.