ఆసియా కప్ ఫైనల్లో పాక్పై భారత్ విజయం సాధించడంతో ప్రధాని మోదీ పోస్టు పెట్టారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ‘ఆపరేషన్ సింధూర్’ అని పేర్కొన్నారు. భారత క్రికెటర్లకు మోదీ అభినందనలు తెలిపారు. అలాగే, భారత జట్టును ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. భారత క్రికెట్కు ఇది అద్భుతమైన క్షణం.. టీమిండియా స్ఫూర్తి దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు.