PLD: వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు ఆదివారం 35 మంది జర్నలిస్టుల పిల్లలకు ఒక్కొక్కరికీ రూ. 10వేల చొప్పున మెరిట్ స్కాలర్షిప్లు అందించారు. ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు రాబోయే ఐదేళ్లూ ఈ ఉపకార వేతనం అందిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు త్వరలో రెండు సెంట్ల ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చి, కాలనీని మోడల్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.