TG: ‘నన్ను నమ్మండి, మీకు మంచి చేస్తాను’ అని CM రేవంత్ అన్నారు. ‘నగరంలో రెండు గంటల్లోనే 40-50 సెం.మీల వర్షపాతం నమోదవుతోంది. దీన్ని తట్టుకునే వ్యవస్థ ప్రస్తుతం లేదు. భవిష్యత్తులో మంచి వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే, కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఒక్క రాత్రిలోనే నీట మునుగుతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందిస్తాం’ అని హామీ ఇచ్చారు.