WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని శనిగరం గ్రామ శివారులో రైతులు వేసిన పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారి (AEO) శివకుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవరు, ఏ పంట వేశారో వారి సర్వే నెంబర్ ఆధారంగా తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన రైతులకు వివరించారు.