ADB: పంట పొలాల్లో అటవీ జంతువుల నుంచి రక్షణగా కరెంట్ వైర్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇచ్చోడ సీఐ బండారి రాజు ఆదివారం తెలిపారు. పంట పొలంలో కరెంటు వైర్ పెట్టి ఒక వ్యక్తి మృతికి కారణమైనటు వంటి వ్యక్తులు చిక్రం పాండు, ఈశ్వర్ ను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇకపై రైతులు వ్యవసాయ పొలంలో విద్యుత్తు తీగలను అమర్చవద్దని సూచించారు.