WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపు సద్దుల బతుకమ్మ పండగ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పర్వతగిరి మండల కేంద్రంలో 50 ఏళ్ల మహిళ తంగేడు పూల కోసం 20 అడుగుల ఎత్తైన చెట్టు ఎక్కి పూలు కోసింది. పండుగకు వచ్చిన కూతురు, మనవరాలు బాధపడకూడదని ఈ చర్య తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమై, సోషల్ మీడియాలో వైరల్గా మారింది.