VZM: ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఓ వీధిలో కాయిన్స్ ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు పట్టుబడినట్లు సీఐ వి.నారాయణమూర్తి తెలిపారు. వారి నుంచి రూ.25,150 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.