BDK: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చిన బతుకమ్మలు చుట్టూ వాళ్ళతో కలిసి నృత్యం చేశారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి సాంప్రదాయం మన తెలంగాణలోనే ఉందని ఎమ్మెల్యే కొనియాడారు. వారితోపాటు డీఎస్పీ భాను చంద్ర, సీఐ సురేష్ ఉన్నారు.