SRD: జహీరాబాద్ పరిధిలోని నారింజ వాగును ఎమ్మెల్యే మాణిక్యరావు ఆదివారం పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా నారింజవాగు ఉధృతి పెరిగిందని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.