PDPL: దేశంలో కుల రహిత సమాజం కోసం పోరాడాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే. రాజన్న పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలోని ఐఎన్టీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కుల నిర్మూలన సదస్సులో మాట్లాడారు. కష్టజీవుల సమస్యల పరిష్కారంతో పాటు కుల రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.