BHPL: జిల్లా కోర్టులో ఇటీవల పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు చేపట్టిన బోట్ల సుధాకర్‌ను ఆదివారం బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నేమొగిలి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సుధాకర్ చిన్ననాటి నుంచి కష్టపడి చదువుకుని, ఈ స్థాయికి చేరడం సంతోషమని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చేలా పనిచేయాలని సూచించారు.