VSP: విశాఖ కేంద్ర కారాగారంలో (సెంట్రల్ జైల్) ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. విమ్స్ రక్తనిధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో జైలు అధికారులు, సిబ్బంది కలిపి 18 మంది రక్తదానం చేశారు. పర్యవేక్షణాధికారి ఎం. మహేష్‌బాబు మాట్లాడుతూ.. ప్రాణాపాయంలో ఉన్నవారికి ఈ రక్తం ఎంతో మేలు చేస్తుందని, సిబ్బందిని అభినందించారు.