EG: భవిష్యత్తులో రాజమండ్రిని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతామని శాప్ ఛైర్మన్ ఎ.రవి నాయుడు అన్నారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో జరిగిన సీనియర్ ర్యాంకింగ్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు సభ ఆదివారం రాత్రి జరిగింది. వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ పోటీలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడలకు కూటమి అన్ని విధాలా సహకారం అందిస్తుందని అన్నారు.