MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లిలో దుర్గామాతకు ఎంఎల్ఏ బొజ్జు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఆయన బాదంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత అమ్మవారు ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.