NLG: నల్లగొండ పట్టణంలో నల్గొండ మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు వారిని ఆదివారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు.