W.G: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు స్వదేశీ వస్తువులనే వాడాలని, ప్రతి భారతీయుడు వోకల్ ఫర్ లోకల్ సంకల్పం స్వీకరించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. ఆదివారం భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో మన్-కీ-బాత్ వీక్షించి, ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ సంకల్ప పత్రం ప్రతిజ్ఞ చేశారు. ప్రధాని పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు.