GNTR: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ పట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పెండింగ్ కేసులపై త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు.