మూసీ ఒకప్పుడు మంచి నీటితో కళకళలాడేదని సీఎం రేవంత్ చెప్పారు. కానీ ఇప్పుడు మురికి కూపంగా మారిందని తెలిపారు. భారీ వర్షాలను తట్టుకునేలా మూసీని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రాను తీసుకొచ్చి మంచిపని చేస్తుంటే కొంతమంది బురద జల్లారని మండిపడ్డారు. బతుకమ్మ కుంటకు హైడ్రా పునర్జీవం పోసిందని ప్రశంసించారు. బతుకమ్మ కుంట కోసం వీహెచ్ పోరాటం చేశారని కొనియాడారు.