అన్నమయ్య: ఈ నెల 29న సోమవారం ఉదయం 10 గంటలకు రాయచోటి జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ ఉంటుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్సైట్ తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని, 1100 నంబర్ ద్వారా వాటి స్థితిని తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.