W.G: భీమవరం మండలం గొల్లవానితిప్పలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆదివారం పర్యటించారు. అభ్యంతరాలు లేని పోరంబోకు భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అభ్యంతరాలు లేని ప్రభుత్వ పోరంబోకు స్థలాలలో ఇల్లు నిర్మించుకొని నివాసాలు ఉంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.