SRCL: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి అమ్మవారు నెమలి వాహనంపై విహరించారు. ఉత్సవాలలో భాగంగా ఆరో రోజు కాత్యాయని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అంతరాలయంలో అమ్మవారు నంది హనుమంతుడు వాహనంపై విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు.