SRCL: దేవీ నవరాత్రులను పురస్కరించుకొని, కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో నెలకొల్పిన దుర్గ మాత అమ్మవారిని ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రభుత్వ విప్‌ను ఘనంగా సత్కరించారు.