W.G: మెగా డీఎస్సీలో భీమవరం నుంచి శిక్షణ పొంది 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆదివారం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 108 మంది ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. కేటగిరీల వారిగా 1, 2, 3, 4, 6, 8వ ర్యాంక్‌లతో విజయభేరీ మోగించిన అభ్యర్థులను ఎమ్మెల్యే అభినందించారు.