అన్నమయ్య: భగత్ సింగ్ జయంతిని మదనపల్లెలోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నందు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సెక్రటరీ కవితా రాణి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన భగత్ సింగ్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం భారతదేశపు బానిస సంకెళ్లు తెంచేందుకు భగత్ సింగ్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.