GNTR: వరద ప్రభావిత ప్రాంతమైన తుళ్లూరు(M) తాళ్లాయపాలెం లంక గ్రామంలో ఆదివారం కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటించారు. గ్రామస్తులు అందరూ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్ళుటకు వాహనాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 6 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, రిస్క్ తీసుకోవద్దని గ్రామస్తులకు సూచించారు.