ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనలో ఆదివారం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా త్రిముఖ దుర్గామా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వంశీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సరస్వతి దేవి అలంకారం చేసి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. అర్చకులు అభిషేకం పూజలు, కుంకుమార్చన పూజలు, చండీ హోమం నిర్వహించారు.