BPT: ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి ప్రజలు హాజరుకావాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. రేపు ఉదయం 9 నుండి 10 గంటల వరకు జిల్లా అధికారులతో గత అర్జీలపై సమీక్ష నిర్వహించి, ఆ తర్వాత 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు.