BHPL: బతుకమ్మ, దసరా పండుగల వేళ యూరియా కోసం రైతులు క్యూల్లో నిలబడాల్సి వచ్చిందని మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, వద్ద ఆదివారం యూరియా కోసం క్యూలో ఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యూరియా పంపిణీలో విఫలమయ్యారని ఆరోపించారు. క్లస్టర్ వారీగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.